ట్రెండింగ్
Epaper    English    தமிழ்

MONTHA సైక్లోన్ సబబ్: ఇంటర్ కాలేజీలకు ఎగ్జామ్స్ ముందు సెలవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 11:23 PM

'మొంథా' తీవ్ర తుపాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు YSR కడప జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించాయి.కలెక్టర్లు అక్టోబర్ 31 వరకు ఈ సెలవులు అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అన్ని RJDIES, DIEO, RIOలకు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. సెలవుల రోజుల్లో విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండేలా చూడాలి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం అన్ని అధికారులు జిల్లా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ఎమర్జెన్సీ కోసం సంప్రదించాల్సిన నంబర్: ‪+91 63053 13558‬, ఇ-మెయిల్: parentsassociationap@gmail.com.కాకినాడ-మచిలీపట్నం మధ్య 'మొంథా' తీవ్ర తుపాను తీరం తాకింది. అంతర్వేది పాలెం, రాజోలు-అల్లవరం ప్రాంతాల్లో తుఫాను తీవ్రంగా ఉందని, సముద్రపు అలలు లైట్‌హౌస్ కట్టడాలను తాకుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మచిలీపట్నానికి 20 కిమీ, కాకినాడకు 110 కిమీ, విశాఖకు 220 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.అక్టోబర్ 29 బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.తుపాను ధాటికి కోస్తాంధ్రలోని గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. రాబోయే 8–10 గంటలలో భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగనున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 10–20 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. గంటకు 110 కిమీ వేగంతో గాలులు విస్తున్నాయి. గుడివాడలో తుపాను ప్రభావంతో ప్రధాన రహదారుల్లో చెట్లు కూలిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై కూలిన చెట్లను విపత్తు సహాయక బృందాలు తొలగిస్తున్నారు. రాజోలు నియోజకవర్గం కూడా అంధకారంలో ఉంది, పలు సెల్‌ టవర్స్‌కు నష్టం అయ్యింది.మొంథా తుపాను ప్రభావాన్ని సీఎం చంద్రబాబు సమీక్షించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బృందాలను పంపి పంటనష్టం వివరాలను కేంద్రానికి అందించాలని ఆదేశాలు ఇచ్చారు. విజయనగరం జిల్లా గుర్ల KGBVలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 30 మంది విద్యార్థులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa