ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లోని ముజఫర్‌పూర్, ఛప్రాలలో రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ బీహార్‌లో బీజేపీ-ఎన్డీఏ కూటమి సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "బీహార్‌లోని నా కుటుంబ సభ్యులే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం కోసం స్వయంగా బరిలోకి దిగారు. ఈ ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ ఉదయం 11 గంటలకు ముజఫర్‌పూర్‌లో, మధ్యాహ్నం 12:45 గంటలకు ఛప్రాలో ప్రజలతో సంభాషించే భాగ్యం నాకు కలుగుతుంది. రాష్ట్రంలోని నా సోదర సోదరీమణులు మరోసారి విజయ శంఖాన్ని పూరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa