భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ విదేశీ ప్రకటనల ద్వారా సంపాదించిన ఆదాయంపై తెలివైన పన్ను వ్యూహాన్ని అవలంబించారు. 2002–03 ఆర్థిక సంవత్సరంలో రూ.5.92 కోట్ల ఆదాయంపై సెక్షన్ 80ఆర్.ఆర్ కింద 30% మినహాయింపు కోరారు. తన ఆదాయం క్రికెటర్‌గా కాకుండా నటుడిగా వచ్చినదని పేర్కొనడంతో ఈ మినహాయింపు పొందారు. ఆదాయపు పన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా, ఐటీఏటీ మోడలింగ్, ప్రకటనలు కళాత్మక ప్రదర్శనలో భాగమని అంగీకరించి సచిన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనకు రూ.58 లక్షల పన్ను మినహాయింపు లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa