ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈరోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగనున్న ఈ సమీక్షలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న వివాదాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ లోపం, క్రమశిక్షణ ఉల్లంఘనల వంటి అంశాలను చక్కదిద్దడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల కొందరు నేతలు క్రమశిక్షణ గీత దాటుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, వారితో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడనున్నారు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో రాజుకున్న వివాదంతో పాటు, మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ అంశాలకు వెంటనే పరిష్కారం కనుగొని, పార్టీ పటిష్ఠతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa