అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ముందు 'ట్రూత్ సోషల్'లో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో అణు పరీక్షలు చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ, రష్యా, చైనా వంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో పరిస్థితులు మారాయని, అమెరికా కూడా అణ్వాయుధ సామర్థ్యంలో సమానస్థాయికి చేరుకోవడానికి పరీక్షలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa