హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం 'కార్ టైటాన్స్' అమెరికాలోని చికాగోలో జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ (ఏసీఆర్) నాలెడ్జ్ బౌల్-2025 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. 40 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జట్టుగా నిలిచిన ఈ బృందం, మేయో క్లినిక్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వంటి అగ్రశ్రేణి సంస్థలను అధిగమించింది. రుమటాలజీ హెచ్‌వోడీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, డాక్టర్ మోహిత్, డాక్టర్ రితేశ్‌తో కూడిన ఈ బృందం, టీమ్ స్పిరిట్ అవార్డును కూడా కైవసం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa