అమెరికా షట్‌డౌన్, సెప్టెంబర్ 30 నుంచి నిధుల కొరతతో లేబర్ కండీషన్ అప్లికేషన్లు (LCA), ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ (PERM) దరఖాస్తులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్1బీ వీసాతో పాటు ఇతర ఉపాధి వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభించినట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. అమెరికన్ కంపెనీలు మళ్లీ దరఖాస్తులు ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ నిర్ణయంతో భారతీయులకు ఊరట లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa