వాట్సాప్‌కు ప్రత్యర్థిగా దేశీయ టెక్ సంస్థ జోహో “అరట్టై” పేరుతో ఒక మెసేజింగ్ యాప్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త యాప్ తక్కువ కాలంలోనే యూజర్లలో మంచి క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి.ఇప్పుడు అరట్టై వాట్సాప్‌లా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను కూడా అందించబోతోంది. అయితే, ఈ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఉండాలా, లేక యూజర్ ఇష్టానుసారమే ఉపయోగించాలా అనే అంశంపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) వినియోగదారుల అభిప్రాయాలను కోరారు.
*శ్రీధర్ తెలిపారు, యూజర్‌కి రెండు ఎంపికలు ఉంటాయని:
అన్ని చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఆటోమేటిక్‌గా అమలు చేయడం,
కావాలనుకున్న చాట్‌లకు మాత్రమే ఈ సెక్యూరిటీ ఆప్షన్‌ను ఉపయోగించడం.
రెండు ఎంపికలలో ఏది ఎంచుకున్నా, ఆ చాట్ పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల మెసేజ్ పంపినవారు, స్వీకరించినవే మాత్రమే చాట్ చదవగలరు; మధ్యవర్తి లేదా సంస్థ ఈ డేటాను చూడలేడు.ఇప్పటివరకు వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్‌లు ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను డిఫాల్ట్‌గా అందిస్తున్నాయి. ఇక అరట్టై యాప్ యూజర్ల అభిప్రాయాల ఆధారంగా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa