ఐరోపాలో యుద్ధం ముంచుకొస్తున్న సమయంలో నాజీల నుంచి కాపాడుకోవడానికి ఒక కుటుంబం రహస్యంగా పాతిపెట్టిన వేలాది బంగారు, వెండి నాణేలు సుమారు 75 మిలియన్ పౌండ్లకు ప్రస్తుతం వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. 1930లలో ఒక కలెక్టర్ సేకరించిన ఈ నాణేలను, నాజీ దళాలకు భయపడి తోటలో దాచిపెట్టారు. దురదృష్టవశాత్తు, ఆ భయంతోనే ఆయన గుండెపోటుతో మరణించారు. సుమారు 20 వేల నాణేల నిధి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇందులో రోమన్ చక్రవర్తి ఫెర్డినాండ్ III రూపొందించిన 100-డకాట్ బంగారు నాణెం కూడా ఉంది, దీని ధర కనీసం 944,760 పౌండ్లు ఉండొచ్చని అంచనా. ఈ నాణేలు ఒకప్పుడు అమెరికన్ బ్యాంకర్ వాల్డో న్యూకమర్‌కు చెందినవిగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa