దుబాయ్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన నితిన్ కున్నత్ రాజ్ అనే ప్రవాస భారతీయుడు బిగ్ టికెట్ ఈ డ్రాలో పావుకేజీ (250 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నారు. 10 మంది స్నేహితులతో కలిసి కొన్న టికెట్‌కు ఈ అదృష్టం వరించింది. మన దేశంలో దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని స్నేహితులతో పంచుకుంటానని, ఇలా అదృష్టం వరించడం ఇదే తొలిసారని కున్నత్ సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa