బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సీఐ కె. సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో వందేమాతరం జాతీయ గేయం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, మాజీ సైనికులు, విద్యార్థులు సామూహికంగా గేయం ఆలపించారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని, దీని విలువను భావితరాలకు చేరవేయాలని సీఐ సతీష్‌కుమార్ అన్నారు. ఎస్సై జ్ఞాన ప్రసాద్, మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు రేవళ్ల కిరణ్‌కుమార్, ఇతర సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa