మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి, క్రికెటర్ శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో 1,000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. అలాగే మంత్రి లోకేశ్ కూడా ఈ విషయమై 'ఎక్స్' వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. "శ్రీచరణి అచంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె అద్భుతమైన విజయాన్ని గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది" అంటూ మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa