కేరళలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎం.ఆర్. రఘుచంద్రబాల్ (75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (నవంబర్ 7) తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1980, 1991లో కోవళం, పరశాల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘుచంద్రబాల్, 1991-95 మధ్య కాలంలో సీఎం కరుణాకరన్ కేబినెట్‌లో మత్స్యశాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన మృతిపై రాష్ట్ర రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa