AP: గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ పొందాలంటే ఇక నుంచి ఈ-కేవైసీ, బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఒకసారి ఈ-కేవైసీ చేస్తే రాయితీ అందేది. కానీ ఇక నుంచి ఏడాదికి ఒకసారి ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి. 8, 9వ సిలిండర్లు పొందే ముందే ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోకుంటే రాయితీ కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది మార్చి 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. హెచ్‌పీ, భారత పెట్రోలియం, ఐవోసీ కంపెనీల వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa