AP: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి అనే వ్యక్తి విశాఖలోని మాల్కాపురంలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ బార్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన గణపతి అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం రాత్రి మద్యం షాపు వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa