విజయనగరంలో సోమవారం మైనారిటీ వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు జరుగనున్నాయని ఆదివారం చెప్పారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులను సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa