ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం ఒక్కసారైనా థాయిలాండ్‌ను సందర్శించాలని కల ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్, అద్భుతమైన బీచ్‌లు, ఉత్సాహభరిత నైట్‌లైఫ్ కోసం ప్రసిద్ధి పొందిన ఈ దేశం ఇప్పుడు మద్యం సేవనంపై కొత్త నిబంధనలను అమలు చేసింది.ఈ నియమాలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. థాయిలాండ్‌ను సందర్శించే మద్యం ప్రియ పర్యాటకులకు ఈ మార్పులు చిన్న తలనొప్పిగా మారాయి. సాధారణంగా, పర్యాటకులు వీధి ఆహారంతో పాటు మద్యం ఆస్వాదించడం ఇష్టపడతారు. అయితే, ఇప్పుడు థాయిలాండ్‌లో మద్యం సేవించడానికి నిర్దిష్ట సమయాలు మాత్రమే అనుమతిస్తారు.కొత్త చట్టం ప్రకారం, మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మద్యం సేవించడం నిషేధం. సవరించిన మద్యం నియంత్రణ చట్టం నవంబర్ 8న అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను ఉల్లంఘించే వారికి 10,000 బాట్ (సుమారు ₹27,357) వరకు జరిమానా విధించనున్నారు.ఉదాహరణకు — ఎవరైనా మధ్యాహ్నం 1:59కు బీరు కొనుగోలు చేసి, 2:05 గంటలకు తాగితే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ కొత్త నిర్ణయం వల్ల వ్యాపారం నష్టపోతుందని, ముఖ్యంగా రెస్టారెంట్ మరియు బార్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa