పెన్నీ స్టాక్స్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఈ కేటగిరీలోని కొన్ని స్టాక్స్ తమ షేర్ హోల్డర్లకు భారీ రిటర్న్స్ ఇస్తుంటాయి. మరికొన్ని మాత్రం భారీ నష్టాలు మిగులుస్తాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెన్నీ స్టాక్స్‌కి హైరిస్క్ ఉంటుంది. అయినా భారీ లాభాలు అందించిన స్టాక్స్ ఉన్నాయి. అందులో టాప్-10 పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ గత ఆరు నెలల్లోనే ఏకంగా 600 శాతం వరకు లాభాలు అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా నిలిచాయి. కేవలం రూ. 15 లోపే ఈ స్టాక్స్ ధర ఉండడం గమనార్హం. మార్కెట్ క్యాప్ రూ. 500 కోట్లు లోపే ఉంది.
వన్ సోర్స్ ఇండస్ట్రీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్
వన్ సోర్స్ ఇండస్ట్రీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ అదరగొట్టింది. గత ఆరు నెలల్లో ఏకంగా 601 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్‌గా అవతరించింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.7 లక్షలకు పైగా చేసింది. ఈ స్టాక్ ఈరోజు ట్రేడింగ్ లో 5 శాతం నష్టపోయి రూ. 9.40 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 488 కోట్ల వద్ద ఉంది.
ఆన్టిక్ ఫిన్ సర్వ్ లిమిటెడ్
ఆన్టిక్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ స్టాక్ గత ఆరు నెలల్లో 329 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్‌గా అవతరించింది. లక్ష రూపాయలను 6 నెలల్లోనే రూ.4.29 లక్షల వరకు అందించింది. ఈ రోజు ట్రేడింగులో 1.03 శాతం నష్టంతో రూ. 2.89 వద్ద ట్రేడయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 26 కోట్ల వద్ద ఉంది.
బ్లూ గాడ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్
బ్లూ గాడ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ స్టాక్ గత ఆరు నెలల్లో 292 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.3.92 లక్షలు చేసింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 2 శాతం నష్టపోయి రూ. 3.43 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 189 కోట్ల వద్ద ఉంది.
చంద్రిమా మర్చంటైల్ లిమిటెడ్
చంద్రిమా మర్చంటైల్ లిమిటెడ్ షేర్ ఆరు నెలల్లో 266 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్ గా నిలిచింది. లక్ష రూపాయలను రూ.3.66 లక్షలు చేసింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 2 శాతం లాభంతో రూ. 10.62 వద్ద ట్రేడయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 354 కోట్లుగా ఉంది.
సెల్ విన్ ట్రేడర్స్ లిమిటెడ్
సెల్ విన్ ట్రేడర్స్ లిమిటెడ్ షేర్ గత ఆరు నెలల్లో 252 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలను రూ.3.52 లక్షలు చేసింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 5 శాతం నష్టంతో రూ. 9.72 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 228 కోట్ల వద్ద ఉంది.
అవాన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్
అవాన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ స్టాక్ ధర గత ఆరు నెలల్లో 177 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలను రూ.2.77 లక్షలకు పైగా చేసింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 5 శాతం నష్టంతో రూ. 1.61 వద్ద ట్రేడయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 319 కోట్ల వద్ద ఉంది.
ప్రో ఫిన్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్
ప్రో ఫిన్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ ధర గత ఆరు నెలల్లో 147 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలను రూ.2.47 లక్షలు చేసింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 5 శాతం నష్టంతో రూ. 9.57 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 283 కోట్ల వద్ద ఉంది.
ఇండియా హోమ్స్ లిమిటెడ్
ఇండియా హోమ్స్ లిమిటెడ్ షేర్ గత ఆరు నెలల్లోనే 137 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయలను రూ.2.37 లక్షలు చేసింది. ఈరోజు ట్రేడింగ్ లో 0.08 శాతం నష్టంతో రూ. 12.20 వద్ద ట్రేడయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 485 కోట్ల వద్ద ఉంది.
ఎక్సెల్ రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్
ఎక్సెల్ రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ స్టాక్ గత ఆరు నెలల్లో 127 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. ఈరోజు ట్రేడింగ్ లో 2.5 శాతం లాభంతో రూ. 1.62 వద్ద ట్రేడయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 229 కోట్ల వద్ద ఉంది.
రామచంద్ర లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్
రామచంద్ర లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ఆరు నెలల్లో 125 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్ గా నిలిచింది. ఈ రోజు ట్రేడింగ్ లో 5 శాతం లాభంతో రూ. 7.32 వద్ద ట్రేడయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 37.45 కోట్ల వద్ద ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa