బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ పండగ వాతావరణంలా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు రికార్డు స్థాయిలో 31.38% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కిషన్‌గంజ్ జిల్లాలో అత్యధికంగా 34.74% ఓటింగ్ నమోదు కాగా, మధుబనీ జిల్లాలో అత్యల్పంగా 28.66% నమోదైంది. గయా, జముఈ, పూర్ణియా, పశ్చిమ చంపారన్, నవాడా, సీతామర్హి జిల్లాల్లో కూడా గణనీయమైన ఓటింగ్ నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa