రాజధాని అమరావతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో "ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ" ఏర్పాటు కానుంది. ఈ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.కె ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెరికల్లాంటి యువ క్రీడాకారులను దేశానికి అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీని స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు.సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్రికెట్ అకాడమీని నిర్మించనున్నారు. ఇది కేవలం శిక్షణా కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి క్రీడా సముదాయంగా అభివృద్ధి చెందుతుందని ఎం.ఎస్.కె వివరించారు. ఈ అకాడమీ ద్వారా స్థానిక క్రికెటర్లలోని ప్రతిభను పెంపొందించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. అమరావతిలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa