ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ ఇక ప్రతిపక్షమేనా..?

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:28 PM

బిహార్ బాద్‌షా ఎవరు.. నితీష్ కుమార్ Vs తేజస్వీ యాదవ్.. ఎగ్జిట్ పోల్స్‌ ఎవరికి పట్టం కట్టనున్నాయి?(ఫోటోలు- Samayam Telugu)


రెండు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగిశాయి. తొలి విడత పోలింగ్ ఈ నెల 6వ తేదీన జరగ్గా.. తాజాగా (నవంబర్ 11వ తేదీన) రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఈనెల 14వ తేదీన బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరగనుంది. ఈ క్రమంలోనే రెండు దశల ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అటు అధికార ఎన్డీఏ కూటమి.. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటములు.. విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఒపీనియర్ పోల్స్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ తప్పదని పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నాయి.


జేవీసీ


ఎన్డీఏ కూటమి-135-150


మహాఘట్‌బంధన్-88-103


జేఎస్‌పీ-0-1


ఇతరులు-3-6


మ్యాట్రిజ్


ఎన్డీఏ కూటమి-147-167


మహాఘట్‌బంధన్-70-90


జేఎస్‌పీ-0-2


ఇతరులు-2-8


పీపుల్స్ ఇన్‌సైట్


ఎన్డీఏ కూటమి-133-148


మహాఘట్‌బంధన్-87-102


జేఎస్‌పీ-0-2


ఇతరులు-3-6


దైనిక్ భాస్కర్


ఎన్డీఏ కూటమి-145-160


మహాఘట్‌బంధన్-73-91


జేఎస్‌పీ-0-3


ఇతరులు-5-7


పీపుల్స్ పల్స్


ఎన్డీఏ కూటమి-133-159


మహాఘట్‌బంధన్-75-101


జేఎస్‌పీ-0-5


ఇతరులు-2-8


చాణక్య స్ట్రాటజీస్


ఎన్డీఏ కూటమి-130-138


మహాఘట్‌బంధన్-100-108


జేఎస్‌పీ-0


ఇతరులు-3-5


పీమార్క్


ఎన్డీఏ కూటమి-142-162


మహాఘట్‌బంధన్-80-98


జేఎస్‌పీ-1-4


ఇతరులు-0-3


ఇక అధికార ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, రాష్ట్రీల లోక్ మోర్చా వంటి పార్టీలు ఉన్నాయి. మరోవైపు.. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్, సీపీఐ (ఎమ్ఎల్), వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ, జనశక్తి జనతా దళ్ వంటి పార్టీలు ఉన్నాయి. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జన సురాజ్ పార్టీ కూడా ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.


బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఈనెల 6వ తేదీన తొలి విడతలో భాగంగా.. 18 జిల్లాల్లో 121 సీట్లలో పోలింగ్ జరిగింది. ఇక తొలి దశలో 64.46 శాతానికిపైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక ఇవాళ జరిగిన రెండో దశ విడతలో భాగంగా 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకే 68.44 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఈనెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa