చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో శరీరాన్ని హైడ్రేటింగ్ చేసే గుణాలు ఉంటాయి. ఈ నీళ్లను తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో సహజంగానే కొందరి శరీరం నుంచి నీరు అధికంగా బయటకు పోతుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. అయితే, కొబ్బరి నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పొడిగా ఉన్న చర్మం తేమగా మారి మృదువుగా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa