శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. కానీ, అది పెరిగితే మాత్రం ముప్పు. ధమనుల్లో అడ్డుంకులు ఏర్పడి.. గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. మందులు అవసరం లేకుండా.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని ఆయుర్వేద డాక్టర్ సలీం జైదీ చెప్పారు. ఇంతకీ ఆయన చెప్పిన చిట్కా ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చుద్దామా!
ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. దీని వల్ల శ్వాస ఆడకపోవడం, బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధమనులు.. రక్త నాళాలు, గుండెనాళాల నుంచి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని తీసుకువెళతాయి. ఈ రక్తం శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాల్ని అందిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఈ సమస్య క్రమంగా తీవ్రమవుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ సలీం జైదీ ఓ చిట్కా చెప్పారు. మన వంటగదిలో దొరికే పదార్థాలతోనే పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, దానితో కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనల్లో అడ్డంకులు ఏర్పడి.. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి కారణమవుతాయని డాక్టర్ సలీం జైదీ చెప్పారు. వెల్లుల్లి, నిమ్మ, అల్లం, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి రసం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ రసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుంతుందని ఆయన చెప్పారు. దీనిని రోజూ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుందని సూచించారు. ఈ రసం ఎలా తయారు చేసుకోవాలి, కొలెస్ట్రాల్‌ని తగ్గించి ధమనుల్ని ఎలా క్లియర్ చేస్తాయో తెలుసుకుందాం.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సాయపడతాయి. వెల్లుల్లి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
నిమ్మ
నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని బలపరిచే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో నిమ్మకాయను తీసుకోవడం వల్ల బ్లాక్ చేయబడిన ధమనులు క్లియర్ అవుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అల్లం
వంటగదిలో దొరికే ఔషధం అల్లం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. రోజూ ఓ చిన్న అల్లం ముక్క తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో మంట, వాపును నియంత్రిస్తుది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.
తేనె
తేనె ఔషధ గుణాలతో కూడిన సహజ స్వీటెనర్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. తేనెలో ధమనుల్ని శుభ్రపరచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం వ్యాధులతో పోరాడటానికి సాయపడతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ LDL కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సాయపడుతుంది. అంతేకాకుండా HDL కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సాయపడతాయి. ఈ ఆహారాలన్నీ కొలెస్ట్రాల్‌ని నియంత్రించి.. ధమనుల అడ్డంకుల్ని నివారిస్తాయి.
ఎలా తయారుచేయాలి?
ముందుగా 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని.. వాటిని తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోయండి. ఒక చిన్న అల్లం ముక్కను తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి. రెండు పదార్థాల్ని మిక్సర్‌లో వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు నాలుగు నిమ్మకాయల రసాన్ని ఒక గ్లాసులో పిండి తీసుకోండి. వెల్లుల్లి-అల్లం పేస్ట్, నిమ్మరసం, ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక కప్పు తేనెను ఒక పెద్ద జాడిలో వేసి బాగా కలపండి. ఈ జాడీని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి.
ఎలా తీసుకోవాలి?
ఫ్రిజ్‌లో నిల్వచేసిన రసం నుంచి ఒక టీ స్పూన్ రసాన్ని.. గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్‌తో పేరుకుపోయిన ధమనులు క్లియర్ అవుతాయని డాక్టర్ సలీం జైదీ చెప్పారు. ఈ రసాన్ని కేవలం 14 రోజులు తీసుకుంటే తేడాను గమనించవచ్చని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa