రాష్ట్ర హోంమంత్రి అనిత విశాఖ పెట్టుబడుల సదస్సు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భాగస్వామ్య సదస్సుపై జగన్ బ్యాచ్ చేసే విషప్రచారాన్ని ఉపేక్షించమని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఈ సదస్సు నేపథ్యంలో సుమారు 3,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టినట్లు తెలిపారు. సదస్సుకు వచ్చేవారు తిరిగి వారి గమ్యస్థానానికి చేరుకునే వరకు రక్షణ బాధ్యత తమదేనని, భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడే పరిస్థితి లేదని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa