బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ వరకు రూ.207.35 కోట్ల జరిమానాలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ 10 నెలల్లో 51.8 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా, జరిమానాల మొత్తం రెట్టింపు అయింది. పెండింగ్ జరిమానాలపై ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 14 వరకు 50% రాయితీ ఇవ్వడం వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణమని బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కార్తీక్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa