ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కప్పు ముఖ్యం బిగిలే’ అంటున్న హర్మన్‌ప్రీత్ కౌర్

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 04:27 PM

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, తమిళ స్టార్ హీరో విజయ్ డైలాగ్‌తో అభిమానులను అలరించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చెప్పిన ‘కప్పు ముఖ్యం బిగిలే’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకుని చెన్నైలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రసంగిస్తూ, విజయ్-అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'బిగిల్'లోని ఫేమస్ డైలాగ్‌ను ప్రస్తావించారు.‘కప్పు ముఖ్యం బిగిలే’ అని ఆమె అనగానే సభ మొత్తం చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. రాబోయే టోర్నమెంట్లలో విజయం సాధించడం తమకు ఎంత ముఖ్యమో సరదాగా చెప్పేందుకే ఈ డైలాగ్ వాడినట్లు ఆమె తెలిపారు. ఈ సరదా సంఘటనతో ఆమె స్థానిక అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa