కోల్‌కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ (India vs South Africa First Test) కేవలం మూడు రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.సౌతాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ పూర్తి చేయలేక ఘోర పరాజయం పాలైంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన కారణంగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ శ్రేణి పూర్తిగా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్ (31) తప్ప, మిగతా ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు.ఓటమి తర్వాత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మీడియాతో మాట్లాడారు. “మేము అడిగిన విధమైన పిచ్ మాకు సిద్ధం చేయడం కోసం క్యూరేటర్ పని చేశారు. మేము ఇలాంటి పిచ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము. అయితే, మా ప్లేయర్లు ఈ వికెట్‌పై మెరుగైన బ్యాటింగ్ చేయలేకపోవడం వల్లనే పరాజయం ఎదురయ్యింది. ఇది కష్టతరమైన పిచ్ కాదు. సరైన డిఫెన్స్ టెక్నిక్ ఉంటే ఇలాంటి వికెట్‌పై కూడా పరుగులు సాధించవచ్చు” అని గంభీర్ తెలిపారు.ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ (Eden Gardens pitch controversy)పై విమర్శలు ఎదుర్కొంటోంది. మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పిచ్ పరిస్థితులు టెస్ట్ క్రికెట్‌కు నష్టం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ పిచ్‌ను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు క్యూరేటర్ సిద్ధం చేశారని సౌరభ్ గంగూలీ వెల్లడించారు. దీంతో గంభీర్‌ను నెటిజన్లు కూడా టార్గెట్ చేస్తున్నారు. కొందరు కోచ్ స్థానంలో మార్పు తీసుకోవాలని సూచనలూ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa