భారతీయ పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం దృష్ట్యా, నేరపూరిత శక్తులు వీసా-రహిత ప్రవేశాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంటూ, భారతీయ సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు కల్పించిన వీసా రహిత ప్రవేశ సదుపాయాన్ని ఇరాన్ ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. నవంబర్ 22 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఇరాన్ ప్రకటించింది. ఉద్యోగాల పేరుతో మోసగించబడి ఇరాన్‌కు వెళ్లిన భారతీయులు కిడ్నాప్‌లకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa