తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి రూ.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. యాత్రికుల సౌకర్యార్థం భవన సముదాయాల నిర్మాణం, అలాగే కాణిపాకంలో సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్ల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ సహాయం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, సామూహిక వివాహాలకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa