సిడ్నీలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డును దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడంతో భారత్‌కు చెందిన 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ మృతి చెందింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె భర్త, కుమారుడితో పార్క్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన సమన్వితను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. గర్భంలోని శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా, సమన్విత స్థానిక సాఫ్ట్‌వేర్ సంస్థలో టెస్ట్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa