రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య కమిటీ సమావేశమైంది.ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ముఖ్య అధికారులతో పాటు రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన పలు అంశాలపై చర్చ జరిగింది. వాటి పరిష్కారం కోసం కమిటీ సమాలోచనలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని చెప్పారు. ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa