ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా జపాన్ కిన్మెమై ప్రీమియం గుర్తింపు పొందింది. దీని ధర కిలోకు దాదాపు రూ.12,500. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ఈ బియ్యాన్ని జపాన్ రైతులు అధునాతన సాంకేతికతతో పండిస్తారు. ప్రత్యేక కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీతో ప్రాసెస్ చేయడం వల్ల సహజ పోషకాలు, రుచి కాపాడబడతాయి. వండే ముందు కడగాల్సిన అవసరం లేని ఈ బియ్యం తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తినిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన హోటళ్లు, ఆరోగ్య ప్రియులు దీనిని 'ప్రీమియం హెల్త్ లగ్జరీ'గా ఉపయోగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa