ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్ఐవీ చెక్ పెట్టే యాంటీరెట్రోవైరల్ థెరపీ,.. ఇక దిగులుపడాల్సిన అవసరం లేదు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 10:19 PM

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి హెచ్ఐవీ  ఉంది. ఇది నయం చేయలేని వ్యాధిని సూచించే పేరుగా మిగిలిపోయింది. కానీ, యాంటీరెట్రోవైరల్ థెరపీ వైరస్‌ను నిరోధిస్తుంది. ఇతరులకు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సాయపడుతుంది. అసలు పవర్ ఆఫ్ యూ = యూ అంటే ఏంటి, యాంటీరెట్రోవైరల్ థెరపీకి ఎలా కట్టుబడి ఉండాలి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం.


హెచ్ఐవీ 


గత రెండు దశాబ్దాల కాలంలో హెచ్ఐవీ  కేర్ స్వరూపమే మారిపోయింది. యాంటీరెట్రోవైరల్ థెరపీలో పురోగతి కారణంగా HIV ఇకపై ప్రాణాంతక అవకాశవాద సంక్రమణ మాత్రం కాదు. ప్రస్తుత రోజుల్లో HIV దీర్ఘకాలిక, సాధారణంగా నిర్వహించదగిన పరిస్థితిగా పరిగణించబడుతుంది.


సకాలంలో రోగ నిర్ధారణ, క్రమం తప్పకుండా చికిత్స, రెగ్యులర్ ఫాలో అప్‌తో.. వైరస్‌తో బాధపడేవారు సాధారణ జీవితాన్ని గడిపేయొచ్చు. వైరస్‌ను నియంత్రించడమే కాదు.. ఎటువంటి అవమానాలు లేకుండా ఇతరుల నుంచి అంగీకారం పొందడమే నేటి లక్ష్యమంటున్నారు డాక్టర్ పి. విష్ణు రావు (కన్సల్టెంట్, అంటు వ్యాధుల విభాగం, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్).


 ఆధునిక ఏఆర్టీ ( యాంటీరెట్రోవైరల్ థెరపీ ) చాలా ప్రభావవంతమైన, తట్టుకోగల చికిత్స. ఇది హెచ్ఐవీ చికిత్స కోసం ఉపయోగించే యాంటీవైరల్ మందుల కలయిక. ఇది వైరస్ వృద్ధిని నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. దీంతో, హెచ్ఎవీ సోకిన వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ మార్పుతో లక్షలాది మంది దీర్ఘకాలం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఇక, హెచ్ఐవీ  అనేది వారి హెల్త్ ప్రొఫైల్‌లో ఒక భాగం మాత్రమే. ముందస్తు రోగ నిర్ధారణ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. హెచ్ఎవీ సోకితే చాలా ఏళ్ల లక్షణాలు చూపించవు. కాబట్టి హెచ్ఎవీ సోకిన వారికి సాధారణ పరీక్షలు చాలా ముఖ్యం. ఏఆర్టీ ని ముందుగానే ప్రారంభించడం వలన వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.


సెరోడిస్కార్డెంట్ జంటలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు


సెరోడిస్కార్డెంట్ జంటలు అంటే.. ఒకరికి హెచ్ఎవీ ఉంటుంది, మరొకరికి ఉండదు. ఇలాంటి జంటలు ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చని డాక్టర్ అంటున్నారు. ఇలాంటి జంటలకు ఆధునిక హెచ్ఐవీ  చికిత్స జీవితాన్ని మార్చేదిగా మారింది. HIV ఉన్న భాగస్వామి ARTని ప్రారంభించి వైరల్ అణచివేతకు చేరుకున్న తర్వాత.. లైంగిక సంక్రమణ ప్రమాదం సున్నా అవుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఈ జంటలు పిల్లల కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు.


హెచ్ఐవీ  2


కట్టుబడి ఉండటమే అసలు విజయం


హెచ్ఎవీ రోగులు కట్టుబడి ఉండాలి. దీని అర్థం వారికి సూచించిన హెచ్ఎవీ మెడిసిన్ రోజు తీసుకోవడం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వైరస్‌ని ఆపడం కష్టమవుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ట్రీట్మెంట్ ఆప్షన్లను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మందులు కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందుకే హెచ్ఎవీ రోగులు చికిత్స విధానానికి కట్టుబడి ఉండాలి. ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల


స్థిరంగా, దీర్ఘకాలిక వైరల్ అణచివేయొచ్చు


ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడం


ఔషధ నిరోధకత నివారణ


మెరుగైన ఆరోగ్య ఫలితాలు


క్రమం తప్పుకుండా క్లినిక్‌కి వెళ్లడం కూడా చాలా ముఖ్యం. దీని వల్ల వైరల్ లోడ్ ఫాలో అయ్యేటప్పుడు మందుల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నియంత్రించవచ్చు. అవసరమైతే ట్రీట్మెంట్‌‌లో మార్పులు చేస్తారు. అంతేకాకుండా ఇతరుల నుంచి ఎదురయ్యే అవమానాల వల్ల వచ్చే మానసిక సమస్యల్ని దూరం చేస్తారు. అంతేకాకుండా క్లిష్ట సమయాల్లో రోగికి మద్దతు ఇవ్వబడుతుంది.


ఈ రోజుల్లో హెచ్ఎవీ సంరక్షణలో యూ=యూనే శక్తివంతమైన మెసేజ్. అంటే వైరల్ లోడ్‌ను గుర్తించలేని స్థాయికి తగ్గించి.. సోకిన వారు ఆరోగ్యంగా జీవించడానికి, ఇతరులకు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సాయపడుతుంది. విస్తృతమైన శాస్త్రీయ ఆధారాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. ప్రధాన ప్రపంచ ఆరోగ్య సంస్థలు దీనిని ఆమోదించాయి. యూ=యూ హెచ్ఐవీ  గురించి మనం ఆలోచించే విధానాన్ని మార్చింది. ఇది వ్యక్తులకు శక్తినిస్తుంది. సంబంధాలను బలపరుస్తుంది. భయంతో పాటు అవమానాల్ని తగ్గిస్తుంది. చికిత్సకు కట్టుబడి ఉండటం ఎందుకు ముఖ్యమో నొక్కి చెబుతుంది.


హెచ్ఐవీ  1


టీకాలు: నివారించగల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ


హెచ్ఐవీ సోకిన వారి వైరల్ లోడ్ బాగా నియంత్రించిన తర్వాత కొన్ని సిఫార్సు చేయబడిన టీకాలను తీసుకోవాలి. ఆ టీకాలు ఏంటంటే


హెచ్ఐవీ టీకా


హెపటైటిస్ బి టీకా


ఇన్ఫ్లుఎంజా టీకా/ ఏటా


న్యుమోకాకల్ టీకాలు


వయస్సుతో పాటు క్లినికల్ సూచనలను బట్టి ఇతర టీకాలు


టీకాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.


హెచ్ఐవీ చికిత్సకు మించి సమగ్ర సంరక్షణ


 హెచ్ఐవీ దీర్ఘకాలిక వ్యాధిగా మారిన కారణంగా సాధారణ ఆరోగ్య నిర్వహణ చాలా ముఖ్యమైంది. రక్తపోటు, డయాబెటిస్, హైపర్లిపిడెమియా యొక్క దీర్ఘకాలిక సమస్యలను క్రమం తప్పకుండా పరీక్షించడం ద్వారా నివారించవచ్చు. వీటిని నిర్వహించడానికి జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం మానేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం మంచి ఆరోగ్యాన్న కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి.


హెచ్ఐవీ నెగటివ్ కోసం నివారణ వ్యూహాలు


హెచ్ఐవీతో పాటు ఇతర లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల (STIs) ప్రమాదాన్ని తగ్గించడానికి కండోమ్‌ల వాడకం


మీరు హెచ్ఐవీ (యూ= యూ) వ్యక్తి అయితే యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) ని ఖచ్చితంగా పాటించడం


PrEP (ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్): అధిక ప్రమాదం ఉన్న లైంగిక పద్ధతుల్లో పాల్గొనే ముందు HIV బారిన పడకుండా మిమ్మల్ని రక్షించడానికి మందుల వాడకం


PEP (పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్): సంభావ్య HIV సంక్రమణకు గురైన తర్వాత (72 గంటల్లోపు) తక్షణ జాగ్రత్తలు తీసుకోవడం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa