యలమంచిలి నియోజకవర్గాన్ని నూతనంగా ప్రతిపాదిస్తున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపకుండా, ప్రస్తుతం ఉన్నట్లుగా అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మ శ్రీ , వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…“యలమంచిలి నియోజకవర్గ ప్రజలకు అనకాపల్లి రెవెన్యూ డివిజన్ దగ్గరగా, సులభంగా అందుబాటులో ఉంటుంది. ఏ వర్గానికైనా సేవలు పొందేందుకు అనువైనది అనకాపల్లే. గతంలో ఎలా అయితే ఈ ప్రాంతాన్ని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించారో, ఇప్పటికీ అదే విధంగా కొనసాగించాలని మా డిమాండ్,” అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa