రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారత్ పర్యటన ఇది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ పర్యటనకు ముందు, రష్యా భారత్‌తో చేసుకున్న సైనిక ఒప్పందానికి తన పార్లమెంట్‌లో ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని రష్యా ప్రభుత్వం విశ్వసిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa