ఆంధ్రప్రదేశ్‌లోని అన్న క్యాంటీన్లలో ఆహారం ఎంతటి నాణ్యంగా ఉంటుంది, వంటగది చుట్టుపక్కల శుభ్రత ఎలా ఉంది అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు తక్కువ ధరకు మెరుగైన భోజనం అందించే ఈ క్యాంటీన్లు ఇకపై కఠిన పర్యవేక్షణలో ఉంటాయన్నమాట. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతస్థాయి సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్యాంటీన్‌కు ప్రత్యేక సలహా కమిటీలను నియమించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ప్రతి అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ సలహా కమిటీకి స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ లేదా కౌన్సిలర్‌ను ఛైర్మన్‌గా నియమిస్తున్నారు. సభ్యులుగా వార్డు శానిటేషన్ సెక్రటరీ, మహిళా & బలహీన వర్గాల రక్షణ సెక్రటరీతో పాటు మరికొంత మంది స్థానిక ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ స్థానిక సమస్యలను తక్షణమే గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునే విధంగా రూపొందించారు.
వారంలో రెండు రోజులు ఈ కమిటీ సభ్యులు అన్న క్యాంటీన్‌లను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. వంటగది శుభ్రత, నీరు నిల్వ, కూరగాయల తాజాదనం, నూనె నాణ్యత, వడ్డన సమయంలో పాటించే జాగ్రత్తలు – ఇలా అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన జరుగుతుంది. ఏ చిన్న లోపమైనా గుర్తిస్తే వెంటనే సరిచేయించే అధికారం కమిటీకి ఉంటుంది.
ఈ కొత్త విధానంతో అన్న క్యాంటీన్లు కేవలం తక్కువ ధర భోజన కేంద్రాలుగా మాత్రమే కాకుండా, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన శుభ్రమైన ఆహార కేంద్రాలుగా మారనున్నాయి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ చైతన్యం ఖచ్చితంగా స్వాగతించదగిన అడుగు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa