NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఇటీవల 18 కీలక స్పెషలిస్ట్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న NGEL, ఈ నియామకాలతో తన బృందాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. ఈ అవకాశం ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లా నేపథ్యం ఉన్న అనుభవజ్ఞులకు అద్భుతమైన అవకాశంగా నిలుస్తుంది.
అభ్యర్థులు డిసెంబర్ 2, 2025 నుంచి డిసెంబర్ 23, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతల విషయానికొస్తే బీఈ/బీటెక్ (సంబంధిత బ్రాంచ్‌లో), ఎంబీఏ/పీజీడీఎం లేదా LLB ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో తప్పనిసరిగా పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టు బట్టి అనుభవం 5 నుంచి 15 సంవత్సరాల వరకు కావాల్సి ఉంటుంది.
స్పెషలిస్ట్ గ్రేడ్-1 పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు కాగా, స్పెషలిస్ట్ గ్రేడ్-3 పోస్టులకు 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ నియమాల ప్రకారం వయసు సడలింపులు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలు శాశ్వతంగా ఉంటాయి, అదనంగా అట్రాక్టివ్ వేతనం, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి.
ఆసక్తి ఉన్న అర్హులు అధికారిక వెబ్‌సైట్ https://ngel.in ద్వారా పూర్తి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలి. గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa