విశాఖ నగరవాసులు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. డిసెంబర్ 1వ తేదీన ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించి, అదే రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు.ఈ వంతెనను ఎంపీ ఎం. శ్రీభరత్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభిస్తారని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ తెలిపారు. వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా రూ. 7 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa