ట్రెండింగ్
Epaper    English    தமிழ்

APSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 02:39 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSRTC ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వ స్థాయిలో త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, ఇతర సంక్షేమ అంశాలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించే వీలుటుందని యూనియన్‌లు హర్షం వ్యక్తం చేశాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa