కిడ్నీల సమస్యలు అనేవి మనకి అనేక రూపంలో కనిపిస్తాయి. మూత్రంలో, మూత్ర రంగులో, మూత్ర విసర్జన శరీరంలోని ఇతర భాగాల్లోనూ కిడ్నీలు దెబ్బతిన్న లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ, వీటిని పూర్తిగా పట్టించుకోకపోతే అవి తీవ్రంగా మారి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీకు గనుక హైబీపి, షుగర్ వంటి సమస్యలు ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ మరింత సీరియస్‌గా మారతాయి. కిడ్నీల సమస్యలు సాధారణంగా మొదటగా కనిపించవు. కొన్నిసార్లు లాస్ట్ స్టేజ్ వరకూ కూడా కనిపించవు. కొన్ని లక్షణాలు కనిపించినప్పటికీ వాటిని మనం మాములూ సమస్యలే అని వదిలేస్తాం. అలాంటప్పుడు అవి తీవ్రంగా మారతాయి. అలాంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అలసట, కాన్సంట్రేషన్ లేకపోవడం, ఆకలిపెరగడం
కిడ్నీల పనితీరు తగ్గడం వల్ల రక్తంలో ట్యాక్సిన్స్, మలినాలు పేరుకుపోతాయి. దీంతో ఊరికే అలసిపోవడం, బలహీనంగా మారిపోతుంటాం. ఏ పనిపై కూడా దృష్టి కేంద్రీకరించం. రక్తం తక్కువగా ఉంటుంది. దీంతో ఊరికే అలసిపోతారు. ఇది చాలా సాధారణ లక్షణం. మూత్రపిండాల పనితీరు తగ్గి ట్యాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
నిద్రపట్టకపోవడం కూడా ఓ లక్షణమే
కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు ట్యాక్సిన్స్ అన్నీ బాడీలోనే ఉంటాయి. రక్తంలోనే అలా ఉండిపోయి నిద్రపోవడం కూడా కష్టంగా మారుతుంది. అతేకాకుండా, డయాబెటిస్, కిడ్నీసమస్యల మధ్య కూడా సంంధం ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు కూడా ఉంటాయి.
స్కిన్ డ్రైగా మారడం, స్కిన్ ప్రాబ్లమ్స్
హెల్దీ మూత్రపిండాలు ఎన్నో పనులని చేస్తాయి. అవి బాడీ నుండి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగిస్తాయి. ఎర్రరక్తకణాలని తయారుచేయడంలో సాయపడతాయి. ఎముకల్ని బలంగా ఉంచుతాయి. మీ రక్తంలో సరైన మొత్తంలో ఖనిజాలని నిర్వహించడానికి పనిచేస్తాయి. దీంతో స్కిన్ డ్రైగా మారి దురద పెడుతుంది. కిడ్నీ సమస్యతో పాటు ఖనిజ, ఎముకల సమస్యలు కూడా వస్తాయి. రక్తంలో ఖనిజాలు, పోషకాల బ్యాలెన్స్ లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి.
మూత్రంలో సమస్యలు
కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మూత్ర సమస్యలు వస్తాయి. ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం, మూత్రపిండాల ఫిల్టర్స్ దెబ్బతింటే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్సన్, ఎన్‌లార్జ్డ్ ప్రోస్టేట్ కారణంగా కూడా జరగొచ్చు. అదే విధంగా. మూత్రంలో రక్తం కనబడుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు రక్తకణాలు మూత్రంలోకి లీక్ అవుతాయి. దీంతో మూత్రంలో రక్తం కణితులు, మూత్రపిండాల్లో రాళ్ళు, ఇన్ఫెక్షన్స్ సూచిస్తుంది. అంతేకాకుండా మూత్రంలో ఎక్కువ నురగ వస్తుంది. మూత్రంలో ప్రోటీన్ రావడం వల్ల ఇలా జరుగుతుంది.
కళ్ళ వాపు మరో లక్షణం
మూత్రంలో ప్రోటీన్ పెరిగితే మూత్రపిండాల ఫిల్టర్స్ దెబ్బతిన్నాయని అర్థం. దీని వల్ల ప్రోటీన్ మూత్రంలోకి లీక్ అయి శరీరంలో ప్రోటీన్‌ని నిలుపుకోకుండా పెద్దం మొత్తంలో ప్రోటీన్‌ని లీక్ చేయడం వల్ల కళ్ళ చుట్టూ వాపు ఉంటుంది.
పాదాలు, చీలమండల వాపు
మూత్రపిండాల పనితీరు తగ్గితే సోడియం నిల్చిపోతుంది. దీంతో మీ పాదాలు, చీలమండలలో వాపు వస్తుంది. కొన్నిసార్లు గుండెజబ్బులు, లివర్ ప్రాబ్లమ్స్ కాళ్ళ సిర సమస్యలు ఉన్నా ఇవే లక్షణాలు ఉంటాయి. దీంతోపాలు కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఇన్‌బ్యాలెన్స్ అవుతాయి. దీంతో కండరాల నొప్పులు ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa