చలికాలం వచ్చిదంటే ఎన్నో సమస్యలు వెంటాడుతాయి. పెరిగిన చలికి సీజనల్ వ్యాధులు వస్తాయి. చలికాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అయితే, చలికాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇంకోకటి ఉంది. అదే మలబద్ధకం. చలికాలంలో మారిన అలవాట్ల కారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా చలికాలంలో తక్కువ నీరు తాగుతుంటారు.
చలి కారణంగా దాహం తక్కువ వేస్తుంది. అందుకే తక్కువ నీరు తాగుతారు. దీంతో.. కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటుంది. మలవిసర్జన సాఫీగా జరగదు. మలం విసర్జించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి రెండు మూడు రోజులకు కూడా మల విసర్జన సాఫీగా జరగదు.
అంతేకాకుండా కడుపు సరిగ్గా క్లీన్ అవ్వదు. మలం రాయిలా గట్టిగా మారుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) మలబద్ధకం తగ్గడానికి కొన్ని చిట్కాలను సిఫార్స్ చేసింది. వీటిని డైలీ పాటిస్తే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.
గోరువెచ్చని నీరు తాగండి
చలికాలంలో శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఎక్కువగా కష్టపడుతుంది. దీంతో.. ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. దీంతో.. చలికాలంలో దాహం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా పోలీస్తే చాలా తక్కువ నీరు తాగుతుంటారు. తక్కువ నీరు తాగడం వల్ల పేగుల్లోని మలం గట్టిపడుతుంది.
ఇది మలబద్ధాకానికి దారి తీస్తుంది. అందుకే చలికాలంలో ప్రతి రోజూ గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. ఇది మన జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. పేగు కదలికల్ని మెరుగుపర్చడంలో సాయపడుతుంది. చలికాలమైనా సరే రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగేలా చూసుకోండి.
సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి
శీతాకాలంలో చాలా మంది వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. ఈ ఫుడ్స్ తినడం వల్ల మలబద్ధకం, అపానవాయువు సమస్యలు పెరుగుతాయి. అందుకే ఆహారంలో పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాల్ని చేర్చుకోండి.
సీజనల్ కూరగాయలు, పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్లు, ముల్లంగి, చిలగడదుంపలు, ఆకుకూరలు, ఉసిరి, జామ, నారింజ, బెర్రీస్, ఆపిల్, దానిమ్మ వంటివి తినాలి. వీటినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం సాఫీగా జరుగుతుంది.
సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం.. ఆహారం మీద మాత్రమే కాకుండా జీవనశైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. చాలా మంది శీతాకాలంలో ఆలస్యంగా నిద్రపోతారు లేదా క్రియారహితంగా ఉంటారు. ఇది జీర్ణ సమస్యల్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఈ తగ్గిన ఒత్తిడి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సాయపడుతుంది. త్వరగా నిద్రపోయి.. ఉదయాన్నే మేల్కోవడానికి ప్రయత్నించండి.
శారీరక శ్రమతో చురుగ్గా పేగు కదలికలు
చలికాలంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దీంతో, చాలా మంది శారీరక శ్రమకి దూరగా ఉంటారు. పెరిగిన చలి కారణంగా ఉదయాన్నే వాకింగ్ చేయడం మానేస్తారు. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య తీవ్రమవుతుంది. అందుకే నిద్ర లేవగానే 10 - 15 నిమిషాలు వాకింగ్ చేయండి.
చలికి బయటకి వెళ్లకపోతే.. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ఎండ రాగానే.. కాసేపు సూర్యకాంతిలో కూర్చోండి. సూర్యకాంతి నుంచి లభించే విటమిన్ డి పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. నడక పేగు కదిలికల్ని మెరుగుపరుస్తుంది. అందుకే వాకింగ్ బెస్ట్ ఆప్షన్.
ఆహారం తినే విషయంలో జాగ్రత్త
శీతాకాలంలో ఎక్కువసేపు ఆకలితో ఉండటం మంచిది కాదు. దీనివల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. పిత్తం పెరుగుతుంది. అందువల్ల, ప్రతి 3 నుంచి 4 గంటలకు తక్కువ మోతాదులో తినండి. సమయానికి తినండి. అల్పాహారం, భోజనం, డిన్నర్ విషయంలో రోజూ ఒకే టైమ్ ఫాలోకండి. రాత్రిపూట ఏడు గంటల్లోపు తినడం మంచిది. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa