Ustaad Bhagat Singh: ఓజీ వంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం *‘ఉస్తాద్ భగత్ సింగ్’*పై అభిమానుల్లో ఉత్సాహం పరిమితి లేదు. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను సాలిడ్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ నెలలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు గతంలో తెలిపిన మేకర్స్, ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ప్రోమో డేట్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు.చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక ఎనర్జిటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి, డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు సాంగ్ ప్రోమో విడుదల అవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అభిమానులు తమ ఇష్ట నటుడి కొత్త సినిమా పోస్టర్ చూసి ఖుషీ చెందుతున్నారు. ఫస్ట్ సాంగ్‌లో పవన్ నుండి అభిమానులు సూపర్ డాన్స్ ఫ్లాక్స్ ఆశిస్తున్నారని సమాచారం.సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa