రాయచోటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సోమవారం జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మునియా నాయక్ అధ్యక్షతన, లెఫ్టినెంట్ కిరణ్ కుమార్, తెలుగు ఉపన్యాసకురాలు శివమ్మల సమన్వయంతో NCC యూనిట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా 35 మంది NCC కేడెట్లు సాయుధ దళాల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం, కేడెట్లు రాయచోటి పట్టణంలో నిధుల సేకరణ చేపట్టి, సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజల్లో అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa