ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పొలూష్యన్ ఆరోగ్యంతో పాటు చర్మం, జుట్టును కూడా ప్రభావితం చేస్తున్నాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. యువత కూడా జుట్టు సంబంధిత సమస్యలతో సఫర్ అవుతున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, బూడిద రంగు జుట్టు వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా యువతలో నెరిసిన జుట్టు సర్వసాధారణంగా మారింది. ఇది వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుంది. ఇక, చాలా మంది తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్, డైలు వాడుతున్నారు. అయితే, వీటిలో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా బలహీనపడుతుంది.
అయితే, ఆయుర్వేదంలో ప్రతి సమస్యకు ఒక చికిత్స ఉంది. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ పూర్ణిమా బహుగుణ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో తెల్ల జుట్టును నల్లగా మార్చే ఓ సింపుల్ చిట్కా షేర్ చేశారు. ఇందుకోసం కేవలం ఒకే ఒక పొడి ఉంటే చాలు. అదే త్రిఫల పొడి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి త్రిఫల పొడిని ఎలా వాడాలి, ప్రయోజనాలేంటి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిఫల పొడితో ప్రయోజనాలు
త్రిఫల అంటే ఉసిరి, తానికాయ, కరక్కాయలతో చేసిన పొడి. ఇందులో ఉండే ఉసిరిలో మంచి మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టుకు పోషణ అందిస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టును నివారించడంలో సాయపడుతుంది. త్రిఫల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు జుట్టు మూలాల్ని పోషిస్తాయి. అలాంటి త్రిఫల పొడితో తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
నీరు - 200 మి.లీ
త్రిఫల పొడి - మూడు టేబుల్ స్పూన్లు
ఇనుప కడాయి ఒకటి
డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా
తయారీ విధానం
ముందుగా ఇనుప కడాయి తీసుకోని.. పొయ్యి మీద పెట్టి ఆన్ చేయండి. ఇందులో నీరు, త్రిఫల పొడి వేసి బాగా కలపండి. చిన్న మంట మీద వీటిని బాగా ఉడికించండి. నీరు సగం అయ్యేంత వరకు మరిగించి.. ఆ తర్వాత ఆఫ్ చేయండి. ఈ ద్రావణాన్ని ఏడు నుంచి ఎనిమిది గంటలు రాత్రిపూట ఇనుప కడాయిలోనే ఉంచండి.
ఈ మిశ్రమం నల్లగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని మరుసటి రోజు ఉదయం తెల్ల జుట్టు కవర్ అయ్యేలా మూలాలపై అప్లై చేయండి. ఆ తర్వాత రెండు గంటల పాటు అలాగే ఉంచి.. నీటితో కడిగి శుభ్రం చేసుకోండి. త్రిఫల పొడి క్రమంగా జుట్టును నల్లగా చేయడమే కాకుండా.. బలంగా మారుస్తుంది.
ఇది జుట్టుకు అప్లై చేయడం వల్ల లాభాలు
త్రిఫల పొడిలో ఉసిరి ఉంటుంది, ఇది జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరి జుట్టును బలోపేతం చేయడానికి, నల్లగా చేయడానికి సహాయపడుతుంది. త్రిఫల బూడిద జుట్టును తొలగించడమే కాకుండా దానిని బలపరుస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. బలహీనమైన, పొడి, నిర్జీవమైన జుట్టు సమస్యను క్రమంగా తొలగిస్తుంది. జుట్టుకు రసాయన రంగులు వాడే బదులు.. దీన్ని అప్లై చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
త్రిఫల పొడిని ఇలా కూడా తీసుకోవచ్చు
చిన్న వయసులోనే జుట్టు నెరవడం ప్రారంభించే త్రిఫల పొడిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. త్రిఫల పొడిని తేనె లేదా బెల్లం కలిపి తీసుకోవచ్చు. అయితే, మీరు త్రిఫల పొడిని తినకూడదనుకుంటే, దానిని రాత్రిపూట నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం వడకట్టి త్రాగాలి. త్రిఫలను 1-2 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టులో గుర్తించదగిన మార్పు కనపిస్తుందని నిపుణులు అంటున్నారు. త్రిఫల పొడి తీసుకోవడం వల్ల జుట్టుకే మాత్రం కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆయుర్వేద ప్రముఖులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa