పిగ్మెంటేషన్ చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్యలలో ఒకటి. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు రెండువైపులు నల్ల, గోధుమ మచ్చలు ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. మంగు మచ్చలను తగ్గించుకోవడానికి ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడుతూ ఉంటారు, ట్రీట్మెంట్స్‌చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్‌డ్రింక్‌తో పిగ్మెంటేషన్‌ను దూరం చేసుకోవచ్చని ఫేస్ యోగా నిపుణులు మాన్సి గులాటి అంటున్నారు.
మ్యాజికల్‌డ్రింక్
ఈ మ్యాజికల్‌డ్రింక్‌తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలతో ఈ డ్రింక్‌రెడీ అవుతుంది.
కావలసిన పదార్థాలు
తెనే - 1/2 టీస్పూన్
యాలకుల పొడి - 1 చిటికెడు
ఇలా తయారు చేయండి
ఒక గ్లాస్‌గోరవెచ్చని నీటిలో అర టీస్పూన్‌తేనె, చిటికెడు యాలకుల పొడి వేసి మిక్స్‌చేయండి. దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తీసుకోండి. ఇది వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే 10 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న పిగ్మెంటేషన్ కూడా తొలగుతుందని మాన్సి గులాటి పోస్ట్‌చేశారు. ఈ డ్రింక్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంతో పాటు మీ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది.
యాలకుల లాభాలు
యాలకులలోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు, పోషకాలు శరీరాన్ని డీటాక్స్‌చేస్తాయి. చర్మంపై మచ్చలు, నీర్జీవం చేసే మలినాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. యాలకులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కిన్‌పిగ్మెంటేషన్‌ను ప్రేరేపించే వాపును తగ్గిస్తాయి. యాలకులలోని పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. యాలకులు మెరిసే చర్మాన్ని మీకు అందిస్తాయని నిపుణులు అంటున్నారు.
తేనెతో కాంతివంతమైన చర్మం
చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంచుతుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమల కారణంగా వచ్చే మొండి మచ్చలను కూడా తొలగిస్తాయి. తేనెలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. UV కిరణాలు, ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
ఈ టిప్స్‌కూడా ఫాలో అవ్వండి
పిగ్మెంటేషన్ తొలగి స్పాట్‌లెస్‌చర్మం కావలంటే మీ డైట్‌ఈ మార్పులు కూడా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రోజూ కనీసం 7-8 గ్లాసుల నీరు తాగండి.
మీ ఆహారంలో రంగురంగుల పండ్లు, కూరగాయలు తీసుకోండి. రంగురంగుల కూరగాయలు, పండ్లలో విటమిన్A, C, E వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ కణాలను రిపేర్‌చేస్తాయి, మీ మేనును ప్రకాశవంతంగా మారుస్తాయి.
మీ డైట్‌లో బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోండి. వీటిలో మీ చర్మానికి ఫ్రెండ్స్‌లాంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌నిండి ఉంటాయి.
చక్కెర, ప్రాసెస్‌చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa