దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ జట్టు యూఏఈపై 234 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, సూర్యవంశీ 171 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో 50 ఓవర్లలో 433/6 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ, 50 ఓవర్లలో 199/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ జట్టులో ఉద్దిశ్ సురి 78*, పృథ్వీ మధు 50 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్ 2 వికెట్లు తీయగా, కిషన్ కుమార్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ ఒక్కో వికెట్ సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa