జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులకు వేడిగా, రుచిగా పౌష్టికాహారం అందించేందుకు ‘స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్’ ప్రాజెక్టు చేపట్టామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ప్రతి మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి, పాఠశాలలకు భోజనం అందిస్తున్నామని చెప్పారు. దీని కోసం సౌర విద్యుత్, బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రశంసించిన సీఎం, ఇది దేశానికే మోడల్‌గా నిలుస్తుందన్నారు. "స్మార్ట్ కిచెన్... స్మార్ట్ హెల్త్... స్మార్ట్ చిల్డ్రన్ అనేలా దీన్ని తీర్చిదిద్దాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలి" అని ఆదేశించారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఈ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించగా ఆయన కూడా అభినందించారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa