తమిళనాడులోని తూత్తుకుడిలో దారుణం జరిగింది. 24ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు 16, 14ఏళ్ల ఇద్దరు బాలురతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అస్సాంకు చెందిన ఆ మహిళ తన భర్తతో కలిసి ప్రధాన నిందితుడి ఇటుక బట్టీలో పనిచేస్తోంది. అయితే ఆ జంట పని మానేసి వెళ్తుండగా వారిని ముగ్గురు నిందితులు అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. తర్వాత బాధితురాలి భర్తపై దాడిచేసి, అతడి ముందే ఆమెపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa