అస్సాంలోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. జమునాముఖ్ - కాంపూర్ సెక్షన్ మధ్య సైరాంగ్ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 20507) పట్టాలపై ఉన్న ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ, ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ధృవీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa