ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ 37 ఏళ్ల లోపు మహిళలకు తన వీర్యం ద్వారా ఐవీఎఫ్ చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని ఆఫర్ ఇచ్చారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, దురోవ్ వీర్యం మాస్కోలోని ఓ క్లినిక్‌లో అందుబాటులో ఉంది. ఆయన గతంలో దానం చేసిన వీర్యాన్ని ఫ్రీజ్ చేసి వినియోగిస్తున్నారు. ఆరోగ్యకరమైన వీర్యదాతలు తక్కువగా ఉన్నందున, సంతానం లేని దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని దురోవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa